: పాక్ లో 12 టన్నుల పేలుడు పదార్థాల స్వాధీనం
పాకిస్తాన్ లోని భద్రతాధికారులు ఆదివారం 12 టన్నుల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో తీవ్రవాదుల రహస్య స్థావరంలో వీటిని స్వాధీనం చేసుకున్నట్టు పాక్ అధికారులు స్పష్టం చేశారు. ఒక తీవ్రవాదిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపిన పాక్ భద్రతాధికారులు, ఈ పేలుడు పదార్థాలను టెర్రరిస్టుల దాడుల్లో వినియోగిస్తారని చెప్పారు.