: ప్రవీణ్ తొగాడియా సహా 500 మంది అరెస్టు


ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో విహెచ్ పీ ప్రత్యక్ష పోరాటానికి దిగింది. రామజన్మభూమిన్యాస్ కమిటీ చైర్మన్ మహంత్ గోపాలదాస్, ప్రవీణ్ తొగాడియాల ఆధ్వర్యంలో 500 మంది కార్యకర్తలతో అయోధ్యలోని మణిరాం చవానీ(అఖాడా) నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. కానీ కొద్ది దూరం వెళ్లగానే యాత్రకు బ్రేక్ పడింది. పోలీసులు యాత్రను అడ్డుకుని వారిని అరెస్టు చేశారు. అయితే తమ యాత్రను రాజకీయం చేయడం సరికాదని, ఇది కేవలం ఒక్కరోజుకే పరిమితం కాదని నేతలు ప్రకటించారు. ఏడాది పొడుగునా యాత్ర సాగుతుందని నినదించారు. యాత్ర చేసి తీరుతామని వీహెచ్ పీ ప్రకటించిన నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు దుకాణాలు బంద్ చేసేశారు. ఒకరకంగా అయోధ్యలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News