: నీటి యుద్ధం... నీరొదల్లేదని అధికారులను అడ్డుకున్న రైతులు
రాష్ట్ర విభజన జరిగితే ఏర్పడే పరిస్థితులను ఇప్పుడే కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు చూపిస్తున్నారు. పంటపొలాలకు నీరు వదలలేదని అధికారులను రైతులు అడ్డుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం పెరికీడులో నీటిపారుదల శాఖ డిఈ కార్యాలయం ఎదుట నీరు తమకు విడుదల చేయాలంటే, తమకు విడుదల చేయాలంటూ కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల రైతులు ఆందోళనకు దిగారు. ఏలూరు కాల్వకు నీరు విడుదల చేయాలని కోరుతూ అధికారులను రైతులు అడ్డుకున్నారు.