: రోజూ రైలు పట్టాలపై 39 మంది బలి
భారతీయ రైలు మార్గాలు మృత్యు దారులుగా మారుతున్నాయి. రైలు పట్టాలపై ప్రతీ రోజూ సగటున 39 మంది రైళ్లు ఢీకొనడం వల్ల ప్రాణాలు కోల్పోతుండడమే ఇందుకు నిదర్శనం. కాపలాలేని రైలు క్రాసింగ్ ల వద్ద, స్టేషన్లలో ఇలా ప్రజలు రైలు చక్రాలకు బలవుతున్నారు. 2009 నుంచి 2012 మధ్య 50,000 మంది రైలు ప్రమాదాల వల్ల గాయాలపాలయ్యారు. ఇటీవలే బీహార్లోని దమారా రైల్వే స్టేషన్లో ప్రయాణికులు రైలు పట్టాలపై వేచి ఉండగా.. రాజ్యరాణి ఎక్స్ ప్రెస్ వారిని తొక్కుకుంటూ ముందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 28 మంది అక్కడికక్కడే మరణించారు.