: హిందూ ఎన్ సైక్లోపీడియా


ఎన్ సైక్లోపీడియా అంటే విజ్ఞాన సర్వస్వం. మొదటి సారిగా హిందూ మతానికి సంబంధించిన ఎన్ సైక్లోపీడియా వచ్చేస్తోంది. హిందూ మతానికి సంబంధించి సమస్త సమాచారంతో 11 వాల్యూమ్ ల ఎన్ సైక్లోపీడియాను సౌత్ కరోలినా వర్సిటీ పరిశోధక విద్యార్థులు రూపొందించారు. దీనిని వచ్చే వారం సౌత్ కరోలినాలో విడుదల చేయనున్నారు. హిందూ మత విశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఫిలాసఫీని ఇందులో పొందుపరిచారు. ఇందులో 1000 చిత్రాలు కూడా ఉన్నాయి. హిందూ దేవతల అందరి చిత్రాలూ కనిపిస్తాయి. దీనిని హిందూ మతం కోసమే రూపొందించలేదని, మొత్తం దక్షిణాసియా సంపద్రాయాలను ప్రతిబింబిస్తుందని సౌత్ కరోలినా వర్సిటీ ప్రొఫెసర్ హాల్ ఫ్రెంచ్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు అకడమిక్ సహకారం అందిస్తానని 1987లో పరిశోధక విద్యార్థులను ప్రోత్సహించింది ఈయనే. 25 ఏళ్ల కృషి తర్వాత హిందూ ఎన్ సైక్లోపీడియా ఒక రూపు తీసుకుని విడుదల కానుండడం విశేషం.

  • Loading...

More Telugu News