: జగన్ నిరాహార దీక్ష ప్రారంభం
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీరును నిరసిస్తూ, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే డిమాండ్ తో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి దీక్ష ప్రారంభించారు. చంచల్ గూడ జైలులో జగన్ దీక్ష ప్రారంభమైనట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటన జారీ చేశారు. ఈ ఉదయం నుంచే దీక్ష ప్రారంభమైందని, టీ, టిఫిన్ ను జగన్ తీసుకోలేదని తెలిపారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు జైలు దగ్గరకు చేరుకోవడంతో అధికారులు భద్రతను పెంచారు.