: సమ్మె విరమించాలంటూ రాఘవులు సూచన


సమైక్యాంధ్ర డిమాండ్ తో నిరవధిక సమ్మె చేస్తున్న ఉపాధ్యాయులు, కార్మికులు దానిని విరమించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విజ్ఞప్తి చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు తమ పదవులు వదులుకోరంటూ పరోక్షంగా వారిని తప్పుబట్టారు. రాజకీయ పార్టీలు మోసపూరిత విధానాలు మానుకుని స్పష్టమైన విధానంతో ఉండాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సమైక్య నినాదంతో కొత్త నాటకాలు ఆడుతున్నాయని రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News