: జగన్ దీక్ష నేపథ్యంలో.. భారీ భద్రత


రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి నేటి నుంచి చంచల్ గూడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. జగన్ దీక్ష గురించి జైలు అధికారులకు సమాచారం లేదు. అయితే, ఆమరణ నిరాహార దీక్ష వార్తలతో జైలు అధికారులు భారీ భద్రత కల్పించారు. రాష్ట్ర విభజన చేస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, లేకుంటే సమైక్యంగానే ఉంచాలని కోరుతూ వైఎస్ విజయలక్ష్మి దీక్ష చేపట్టగా.. జగన్ విజ్ఞప్తితో విరమించుకున్న సంగతి తెలిసిందే. దీంతో తల్లికి బదులుగా తనయుడు జగన్ నేటి నుంచి దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు.

  • Loading...

More Telugu News