: మీ పర్సుని ఛార్జింగ్ చేస్తే చాలు
మీ ఫోన్ను ఛార్జింగ్ చేయకున్నా మీ పర్సుని ఛార్జింగ్ చేసుకుని ఉంటే చాలు. దీంతో ఎంచక్కా మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. అలాంటి కొత్తరకం పర్సులను పరిశోధకులు తయారు చేశారు. ఈ పర్సులను మనకు వీలైనప్పుడు ఛార్జింగ్ చేసుకుంటే చాలట.
ప్రతిరోజూ మన ఫోన్ను ఛార్జింగ్ చేసుకోవడం అనేది ఒక్కోసారి కుదరదు. దీంతో ఒక్కోసారి మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం జరుగుతుంది. అత్యవసర సమయంలో ఇలా మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది. అలాకాకుండా ఈ కొత్తరకం పర్సును మీ దగ్గర ఉంచుకుంటే మీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని దిగులు చెందాల్సిన పనిలేదట. మీ ఫోన్ను ఈ పర్సులో ప్రత్యేకమైన అరలో పెడితే అది రీఛార్జి అయిపోతుందట. పర్సులో మిగిలిన అరల్లో మనకు సంబంధించిన డబ్బు తదితర వస్తువులను పెట్టుకోవచ్చట. ఈ పర్సుని మనకు వీలైనప్పుడు ఛార్జింగ్ చేసుకుంటే రోజుకు రెండుసార్లు మన స్మార్ట్ ఫోన్లను ఎంచక్కా రీఛార్జి చేసుకోవచ్చట.