: జర్నలిస్టుపై అత్యాచార ఘటనలో నిందితుడు మైనర్: కుటుంబసభ్యుల వాదన


ముంబయిలో మహిళా ఫోటో జర్నలిస్టుపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో మొదటి నిందితుడు చంద్ బాబు సత్తార్ షేక్ మైనర్ అంటూ అతని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. ఒకవేళ మైనర్ కాదని తేలితే, మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించాలని నిందితుడి అమ్మమ్మ శరణాభాయ్ కోరింది. ఈ మేరకు ఆమె ముంబయి పోలీసులకు నిందితుడి పుట్టినరోజు ధృవపత్రాన్ని సమర్పించింది.

అందులో అతను 1997, ఫిబ్రవరి 26న జన్మించినట్లు ఉంది. దీన్ని అంగీకరించని పోలీసులు చంద్ వయసు 19 సంవత్సరాలని, అతడిని కాపాడేందుకే కుటుంబ సభ్యులు ఇలా చెబుతున్నారన్నారు. ఈ కేసులో అత్యాచార వ్యతిరేక చట్టం కింద అతనికి ఏడు సంవత్సరాలపైనే శిక్ష పడవచ్చన్నారు. కానీ, దీన్ని తిరస్కరించిన నిందితుడి అమ్మమ్మ.. చంద్ చాలా మంచివాడని, ఇలాంటి పనులు చేయడని, అతనికి పదహారు సంవత్సరాలేనని వాదిస్తోంది. వయసుకు సంబంధించి తన వద్ద సర్టిఫికెట్లు ఉన్నాయని, కోర్టుకు అందజేసి నిరూపిస్తానంటోంది.

మరోవైపు నిందితుడి ఇంటిపక్కల వారు మాత్రం.. చంద్ చిల్లర దొంగ అని, మత్తు మందు తీసుకుంటాడని, మద్యం కూడా తాగుతాడని చెబుతున్నారు. అంతేగాక ఇంతకుముందు అతను పలు క్రిమినల్ కేసులలో నిందితుడని పోలీసుల సమాచారం.

  • Loading...

More Telugu News