: ఇక వినియోగదారులే కరెంట్ అమ్ముతారు!


సౌరవిద్యుత్ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వినియోగదారుడే విద్యుత్ ఉత్పత్తి చేసుకుని, తనకు అవసరమైన మేర వాడుకుని మిగిలింది విద్యుత్ సంస్థలకు అమ్ముకునేలా నెట్ మీటరింగ్ విధానాన్ని అమలులోకి తేనుంది. వినియోగ దారులకు అవగాహన కల్పించేందుకు ఈ రోజు రేపు టాంక్ బండ్ దగ్గరి పీపుల్స్ ప్లాజాలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ పద్దతిలో సౌరపలకలను రూఫ్ మీద ఏర్పాటు చేసుకుని విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చు. ఈ ఏడాది పది వేల మంది వినియోగదారుల ద్వారా సౌరవిద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఈ రకంగా ఉత్పత్తయ్యే విద్యుత్తుకు యూనిట్ కు 2 రూపాయల 60 పైసలు డిస్కంలు చెల్లించనున్నాయి.

  • Loading...

More Telugu News