: మృతుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారమివ్వాలి: చంద్రబాబు


విశాఖపట్టణం హెచ్ పీసీఎల్ దుర్ఘటనలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడ్డవారికి 5 లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ప్రమాద స్థలిని సందర్శించిన బాబు, ప్రమాదం జరిగి రెండు రోజులవుతున్నా మృతుల సంఖ్య కానీ, వివరాలు కానీ యాజమాన్యం చెప్పలేక పొవడాన్ని తప్పుపట్టారు. మృతుల కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. ప్రమాదం హెచ్ పీసీఎల్ యాజమాన్య వైఫల్యం వల్లే జరిగిందని ఆయన మండిపడ్డారు. ఈ సంస్థలో విపత్తు నివారణ చర్యలు లేవని బాబు ఎత్తి చూపారు.

  • Loading...

More Telugu News