: సభ సజావుగా జరుగుతుంది: కమల్ నాథ్
టీడీపీ ఎంపీలను సభ నుంచి 5 రోజుల పాటు సస్పెండ్ చేయడంతో సభ సజావుగా సాగుతుందని తాము ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి కమల్ నాథ్ తెలిపారు. గత కొద్ది రోజులుగా సభలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు ఎంపీలు తమ నిరసనలతో సభను హోరెత్తిస్తుండడంతో సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆయన అన్నారు. స్పీకర్ తాజా నిర్ణయంతో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశముందని కమల్ నాథ్ అభిప్రాయపడ్డారు.