: సచివాలయ ఉద్యోగుల విధులబహిష్కరణ
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఈ రోజు కూడా విధులను బహిష్కరించారు. గత 25 రోజులుగా విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. రోజుకో రకంగా ఆందోళన తెలియజేస్తున్న సచివాలయ ఉద్యోగులు విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భారీ ర్యాలీ చేశారు.