: చిరు ఇంట్లో సీమాంధ్ర నేతల సమావేశం
కేంద్ర మంత్రి చిరంజీవి నివాసంలో సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్టు సమాచారం. కాగా లోక్ సభ నుంచి 12 మంది ఎంపీలు సస్పెండైనప్పటికీ సీమాంధ్ర ప్రాంత ప్రజలు కాంగ్రెస్ నేతల పోరాటాన్ని పెద్దగా గుర్తించడం లేదని, ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ నేతలకు భవిష్యత్ లేదన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఏం చేసి ప్రజలను ఆకట్టుకోవాలన్న దానిపై వీరంతా ముమ్మరంగా ఆలోచిస్తున్నట్టు వారి సన్నిహితులు చెబుతున్నారు.