: కిష్త్వాడ్ అల్లర్లపై ఏకసభ్య విచారణ కమిటీ
కిష్త్వాడ్ మత ఘర్షణలపై విచారణ కోసం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ను నియమించింది. కిష్త్వాడ్ పట్టణంలో రంజాన్ పండగ రోజున ఒక మత వర్గం వారు మైనారిటీలుగా (పండిట్లు) ఉన్న మరో మతవర్గం వారిపై దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడులలో ముగ్గురు మరణించగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సి గాంధీ ఈ అల్లర్లపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. దీని ఆధారంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. అసలు ఘర్షణలు జరగడానికి దారి తీసిన పరిస్థితులు, కారణాలు, అధికారుల వైఫల్యం, తప్పు ఎవరిది మొదలైన విషయాలపై కమిటీ దర్యాప్తు చేస్తుందని ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది.