: గోపీచంద్ అకాడమీకి 'రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్'


పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 'అత్యుత్తమ అకాడమీల ఏర్పాటు, నిర్వహణ' కింద 'రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్' అవార్డు లభించింది. ఈ అవార్డుకు గోపీ చంద్ అకాడమీని కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ సిఫార్సు చేసింది. ఈ నెల 31న ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డును అందించనున్నారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్ వంటి అనేకమంది ప్రపంచ స్థాయి క్రీడాకారులందరూ గోపీ అకాడమీలోనే శిక్షణ తీసుకుంటూ జాతీయ స్థాయి టోర్నీలలో పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News