: హైపర్ సోనిక్ క్షిపణి రూపకల్పనలో భారత్-రష్యా శాస్త్రవేత్తలు


సూపర్ సోనిక్ మిస్సైల్ బ్రహ్మోస్ ను మరింత ఆధునికీకరించి హైపర్ సోనిక్ క్షిపణిగా అభివృద్ధి చేసేందుకు భారత్-రష్యా శాస్త్రవేత్తలు నడుంబిగించారు. బ్రహ్మోస్-2 గా వ్యవహరించే ఈ క్షిపణి మాక్ 7 వేగాన్ని అందుకుంటుందని బ్రహ్మోస్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అంటే, ధ్వని వేగానికి ఏడు రెట్ల వేగంతో ప్రయాణిస్తుందని వారు తెలిపారు. కాగా తొలి తరం బ్రహ్మోస్ క్షిపణి మాక్ 3.5 వేగాన్నిమాత్రమే అందుకుంటుంది.

ప్రస్తుతం ఈ క్షిపణి కోసం అత్యధిక ఉష్ణోగ్రత తట్టుకునే పదార్థం తయారీ కోసం 20 మంది సభ్యుల శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు సాగిస్తోందని ప్రాజెక్ట్ డైరక్టర్ శివథాను పిళ్లై అన్నారు. భారత్, రష్యా దేశాలకు చెందిన రక్షణ పరిశోధన సంస్థలు బ్రహ్మోస్ కార్పొరేషన్ గా ఏర్పడి సంయుక్తంగా మిస్సైళ్లను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే భారత ఆర్మీ, నేవీ వద్ద ఈ క్షిపణులు ఉన్నాయని, తాజాగా వాయుసేన కూడా సమకూర్చుకోవాలని భావిస్తోందని పిళ్లై తెలిపారు. 

  • Loading...

More Telugu News