: సచిన్ శాసించాడు, నేను పాటించాను: రెజ్లర్ సుశీల్ కుమార్
మ్యాచ్ ఫిక్సింగ్ కు దూరంగా ఉండాలని తనకు సచిన్ చెప్పాడని ఒలింపియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ చెప్పాడు. ఢిల్లీలో ఫిక్సింగ్ పై సంచలన విషయాలు వెల్లడించిన ఈ స్టార్ రెజ్లర్ సచినే తనకు మార్గనిర్థేశం చేశాడన్నారు. ఓ ప్రమోషన్ ఈవెంట్ లో సచిన్ తో కలిసి కూర్చున్నప్పుడు ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. మరోసారి సచిన్ తో కలిసి డిన్నర్ చేసినప్పడు తన సహచరుల్ని చూపిస్తూ 'నువ్వు మరో పతకం గెలవాలనుకుంటే వారిలా చేయొద్ద'ని అన్నాడని తెలిపారు. అప్పడు తను తలెత్తి వారిని చూసానని అన్నాడు. వారి పేర్లు చెప్పమని మీడియా ఒత్తిడి చేయగా 'మీరే ఊహించుకోండి' అని సుశీల్ కుమార్ తెలిపారు. సచిన్ చెప్పినట్టే తాను ఫిక్సింగ్ కు దూరంగా ఉన్నానని సుశీల్ కుమార్ స్పష్టం చేశారు.