: మూడేళ్ల చిన్నారిని కాటేసిన కామాంధుడు


దేశంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. వావివరుసలు, చిన్నా, పెద్దా భేదాలు లేకుండా మహిళలు వారి కామదాహానికి బలవుతున్నారు. మొన్న ముంబైలో ఫోటో జర్నలిస్టుపై అత్యాచార కలకలం చల్లారకముందే ఉత్తరప్రదేశ్ లో నర్సరీ చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై ఆ స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారం చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యూపీలోని బహ్రుచ్ జిల్లాలో ఓ నర్సరీ స్కూల్ కు చెందిన వ్యాను డ్రైవర్ అనిల్ కుమార్ బెరియ శుక్రవారం పిల్లలందర్నీ స్కూలు దగ్గర దింపాడు. కానీ మూడేళ్ల చిన్నారిని మాత్రం నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తరువాత నేరుగా ఆమెను ఇంటి దగ్గర దింపాడు. ఆ చిన్నారి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేశారు. నిందితుడిపై బాలిక బంధువులు దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. చిన్నారిని వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా వైద్యులు అత్యాచారాన్ని నిర్ధారించారు.

  • Loading...

More Telugu News