: హెచ్ పీసీఎల్ ప్రమాదంలో పెరిగిన మృతులు
నిన్న సాయంత్రం విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్ పీసీఎల్) లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. మొత్తం 36 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆరుగురు గల్లంతయ్యారని నిర్ధారించారు. ప్రమాద సమయంలో అక్కడ 100 మంది కార్మికులు ఉన్నారు. దీనికి నిరసనగా నాలుగు వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి పరామర్శించారు.