: పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని వీక్షించనున్న రాష్ట్రపతి, సీఎం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు శ్రీహరికోటకు రానున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్)లో సాయంత్రం పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం జరగనుంది. దీనిని వీక్షించడానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మధ్యాహ్నానికి షార్ కు చేరుకుంటారు.
సాయంత్రం ప్రయోగాన్ని వీక్షించిన అనంతరం రాత్రి షార్ కేంద్రంలోనే విడిది చేస్తారు. మంగళవారం ఉదయం చెన్నైకు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోతారు. రాష్ట్రపతి వెంట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కూడా ఉంటారు.
సాయంత్రం ప్రయోగాన్ని వీక్షించిన అనంతరం రాత్రి షార్ కేంద్రంలోనే విడిది చేస్తారు. మంగళవారం ఉదయం చెన్నైకు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోతారు. రాష్ట్రపతి వెంట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కూడా ఉంటారు.
ఇప్పటికే ఇస్రో చైర్మన్ రాధా కృష్ణన్, ఇతర ముఖ్య శాస్తవేత్తలు షార్ లో ప్రయోగ ఏర్పాట్లు, కౌంట్ డౌన్ ను పర్యవేక్షిస్తున్నారు. ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ సవ్యంగా సాగుతోంది. సాయంత్రం 5.56 అయిన వెంటనే రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోతుంది.