: అవనిగడ్డలో దూసుకుపోతున్న అంబటి శ్రీహరి
అవనిగడ్డ స్థానం అంబటి శ్రీహరి ప్రసాద్ కే సొంతమయ్యేలా ఉంది. ఆయన తండ్రి, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న అంబటి బ్రహ్మణయ్య ఆకస్మిక మరణంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. టీడీపీ తరఫున బ్రహ్మణయ్య కుమారుడు శ్రీహరి ప్రసాద్ ను టీడీపీ బరిలో నిలిపింది. ఈ స్థానానికి ఈ రోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన లెక్కింపులో శ్రీహరి ప్రసాద్ 17 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.