: అక్కడ మహిళలకు రక్షణ చాలా తక్కువట


మనదేశంలో మహిళలకు రక్షణ చాలా తక్కువ అని ప్రతిరోజూ మనం పేపర్లలో చూస్తున్న అత్యాచారాలకు సంబంధించిన వార్తలు స్పష్టం చేస్తుంటాయి. దీనికితోడు భారతదేశంలో మహిళలకు రక్షణ తక్కువని ఇటీవలే ఒక విదేశీ వనిత చేసిన వ్యాఖ్యలు ఒకవైపు సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి. అయితే మనదేశంలో ఏ ప్రాంతంలో మహిళలకు రక్షణ చాలా తక్కువ అని అడిగితే ఠక్కున కేరళ అని చెప్పవచ్చట. ఎందుకంటే తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో కేరళ అందాల ప్రాంతమేకాదు... అక్కడ మహిళల పాలిట రాక్షసులు కూడా ఎక్కువగానే ఉంటారని తేలిందట.

ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో గోవాతో పోలిస్తే కేరళలోనే మహిళలపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నట్టు తేలింది. ఈ విషయానికి పోలీసు రికార్డులు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కామాతురాణాం... అన్నట్టు కామంతో కళ్లుమూసుకున్న వారికి ఆరేళ్లు, అరవైయ్యేళ్లు అని లేకుండా అన్ని రకాల వయసున్న మహిళలపై అత్యాచారానికి సంబంధించిన కేసులు కేరళ ప్రాంతంలో చోటుచేసుకుంటున్నాయట. ఈ సర్వేలో పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల్లో పాతిక శాతంపైగా కేసులు పదిహేనేళ్లలోపు అమ్మాయిలకు సంబంధించినవికాగా, ఐదుశాతం యాభై ఏళ్లకు పైబడినవారికి సంబంధించినవి ఉన్నాయట. అలాగే కేరళలో గృహహింస బాధితులు యాభైశాతం కంటే ఎక్కువగా ఉన్నారట. అల్లరిపెట్టడం, అదృశ్యం చేయడం, వరకట్నం చావులు, కట్నం అడగడం వంటివి అక్కడ ఎక్కువగానే ఉంటాయట. రాష్ట్రంలో పలు ప్రాంతాలకు వెళ్లిన అధ్యయన బృందానికి చాలామంది బాధితులు అసలు పోలీస్‌ స్టేషన్‌ గుమ్మం కూడా తొక్కడంలేదని తేలింది. ఈ వివరాలపై స్పందించిన కేరళ పోలీసులు, నిపుణులు స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలిసి మహిళల రక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ఒక ప్రత్యేక ప్రణాళిక రచనకు పూనుకున్నారు.

  • Loading...

More Telugu News