: అమ్మల ఆహారమే పిల్లల ఆరోగ్యం


గర్భవతులుగా ఉండే మహిళలు ఎంత మంచి ఆహారం తీసుకుంటే వారికి పుట్టే పిల్లలు అంత చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ విషయాన్ని పలువురు శాస్త్రవేత్తలు అనేకపర్యాయాలు చెబుతున్నారు. అయినా కూడా గర్భవతులు కొందరు సరైన ఆహారం తీసుకోరు. గర్భంతో ఉండే స్త్రీలు అయోడిన్‌ బాగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని, లేకుంటే వారికి పుట్టే పిలల్లో ఆటిజం సమస్య ఎదురయ్యే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

తల్లులు కావాలనుకునేవారు సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా వారిలో థైరాయిడ్‌ హార్మోను లేకపోతే వారికి పుట్టబోయే పిల్లలు ఆటిజం సమస్యతో బాధపడే ప్రమాదం నాలుగురెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు నాలుగువేలమందికిపైగా మహిళలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చి చెబుతున్నారు. గర్భంతో ఉన్న మహిళలకు టి3, టి4 అనే హార్మోన్లు అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇవి వారి శరీరానికి సరిపడా అందాలంటే తగినంత అయొడిన్‌ను తీసుకోవాలి. లేకుంటే వారికి పుట్టే పిల్లలకు భవిష్యత్తులో ఆటిజం సమస్య ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తలు సుమారు నాలుగేళ్లపాటు కొందరు ఎంపిక చేసుకున్న మహిళలలపై కొన్ని పరీక్షలను నిర్వహించారు. తరచూ వారిలో టి3, టి4 హార్మోన్ల స్థాయిలను కొలిచారు. వచ్చిన ఫలితాల ఆధారంగా ఎంతమంది ఆటిజం సమస్య ఉన్న పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత వారికి పుట్టిన పిల్లలను పరిశీలించాక, ఆ లెక్కలు వారు గతంలో వెల్లడించిన లెక్కలతో సరిపోలడంతో థైరాయిడ్‌ హార్మోనుకు, ఆటిజం సమస్యకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. అందుకే గర్భంతో ఉన్న మహిళలు తమ ఆహారంలో తగినంత అయొడిన్‌ ఉండేలా చూసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News