: 'లైఫ్ ఆఫ్ పై' చిత్రానికి నాలుగు ఆస్కార్ అవార్డులు
లాస్ ఏంజిల్స్ లో ఈ ఉదయం జరిగిన 85వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. భారతీయ నేపథ్యంలో రూపొందిన 'లైఫ్ ఆఫ్ పై' చిత్రం నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. 11 విభాగాల్లో పోటీపడిన ఈ చిత్రం విమర్శకులతో ఔరా అనిపించుకుంది. లెస్ మిజరబుల్స్ చిత్రం 3 విభాగాల్లో, జాంగో అన్ చైన్డ్, లింకన్ చిత్రాలు 2 విభాగాల్లో అవార్డుల దక్కించుకున్నాయి.
ఇక సిల్వర్ లైనింగ్స్.., జీరో డార్క్ థర్టీ చిత్రాలు ఒక్కో అవార్డుతో సంతృప్తిం చెందాయి. 'బీస్ట్ ఆఫ్ ద సదరన్ వైల్డ్' నాలుగు నామినేషన్ లు పొందినప్పటికీ ఒక్క విభాగంలోనూ పురస్కారం దక్కించుకోలేక నిరాశ పరిచింది. కాగా, ఉత్తమ చిత్రం అవార్డును వైట్ హౌస్ నుంచి ప్రత్యేకంగా అమెరికా అధ్యక్షుడు సతీమణి మిఛెల్లీ ఒబామా ప్రకటించారు. 'ద ఆస్కార్ గోస్ టు అంటూ.. 'ఆర్గో' చిత్రం పేరును వెల్లడించారు. ఇక 'ఆమోర్' ఉత్తమ విదేశీ చిత్రంగా అవార్డును కైవసం చేసుకుంది.

పలు విభాగాలు, మిగతా చిత్రాల సంగతి చూస్తే ఉత్తమ విదేశీ భాషా చిత్రం అవార్డును 'అమోర్' (ఆస్ట్రియా), ఉత్తమ లఘు డాక్యుమెంటరీ చిత్రం 'ఇన్నోసెంటీ', ఉత్తమ యానిమేషన్ లఘు చిత్రంగా పేపర్ మ్యాన్ (జాన్ కార్స్), ఉత్తమ షార్ట్ ఫిల్మ్ 'కర్ఫ్యూ', ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం 'సెర్చింగ్ ఫర్ షుగర్ మేన్', ఉత్తమ యానిమేషన్ చిత్రంగా 'బ్రేవ్' గెలుచుకున్నాయి.
ఇక ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ జాక్వెలైన్ డుర్రాన్ (అన్నా కరేనికా), ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును క్లాడియో మిరాండ (చిత్రం: లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ అలంకరణ, కేశాలంకరణ లిజా వెస్ట్ కాట్ (లెస్ మిజరబుల్స్), ఉత్తమ సౌండ్ మిక్సింగ్ అవార్డును లెస్ మిజరబుల్స్ చిత్రానికి అండీ నెల్సన్, మార్క్ పీటర్ సన్, సైమస్ హయేస్ గెలుచుకున్నారు.
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో జీరో డార్క్ థర్టీ, స్కైఫాల్, ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో విలియమ్ గోల్డెన్ బర్గ్ ( ఆర్గో), ఉత్తమ నిర్మాణ రూపకల్పన రిక్ కార్టర్, జిమ్ ఎరిక్సస్ (లింకన్), ఉత్తమ ఒరిజనల్ స్కోర్ మైకెల్ డాన్నా ( లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ ఒరిజినల్ సాంగ్ స్కైఫాల్ చిత్రంలోని స్కైఫాల్, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే క్రిస్ టోరియో (ఆర్గో), ఉత్తమ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే క్వెంటిస్ టరాంటినో (డిజాంగో అన్ చైన్డ్) గెలుచుకున్నారు.