: టీఆర్ఎస్ మద్దతు లేకపోయినా తెలంగాణ వస్తుంది: నాగం
తెలంగాణ ఏర్పాటుకు టీఆర్ఎస్ మద్దతు లేకపోయినా ఫర్వాలేదని బీజేపీ నేత నాగం జానార్థన రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో మాట్లాడిన నాగం, సుష్మాస్వరాజ్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. తెలంగాణ బలిదానాలపై మాట్లాడిన వ్యక్తిని విమర్శించడం సరికాదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. టీఆర్ఎస్ లేకున్నా తెలంగాణ ఆగదని, బీజేపీ మద్దతు లేకుంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యంకాదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు ఉండదని నాగం జనార్ధనరెడ్డి స్పష్టం చేశారు.