: టీడీపీ ఎంపీ శివప్రసాద్ కు అనారోగ్యం


లోక్ సభలో సస్పెండైనా అక్కడే ఉండి ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్యానికి గురయ్యారు. గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా వివిధ రూపాల్లో లోక్ సభలో ఆందోళన చేస్తున్న శివప్రసాద్ కు బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయాయి. దీంతో ఆయనకు వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. లోక్ సభను వీడకుండా ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను మార్షల్స్ బలవంతంగా బయటకు పంపారు. అయితే సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలు కాపాడేందుకు తాము ఆందోళనలు కొనసాగిస్తామని టీడీపీ ఎంపీలు తెలిపారు.

  • Loading...

More Telugu News