: సమైక్యాంధ్రపై రాజకీయ నాయకుల్లో స్పష్టత లేదు: లగడపాటి
సీమాంధ్ర ఉద్యమకారుల్లో ఉన్న స్పష్టత రాజకీయ నాయకుల్లో లేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సీమాంధ్ర ప్రజలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని, తాము కలిస్తే సమైక్యాంధ్ర ఉద్యమం కలుషితం అవుతుందేమోనని దూరంగా ఉన్నామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నామన్న లగడపాటి, ఎన్ని అడ్డంకులు వచ్చినా సమైక్యాంధ్ర సాధిస్తామన్నారు.