: ప్రస్తుత టీడీపీ ఎన్టీఆర్ పార్టీ కాదు: కేటీఆర్


రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి సమైక్యవాదానికే పాటుపడతానన్న నందమూరి హరికృష్ణపై టీఆర్ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు. ఆనాడు నందమూరి తారకరామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీకి, ఇప్పటి టీడీపీ పార్టీకి సంబంధం లేదన్నారు. స్వార్ధ రాజకీయాల పార్టీగా ఇప్పటి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మార్చారని విమర్శించారు. తెలుగు జాతి కలిసి ఉండాలని ఎన్టీఆర్ అన్నారని ఆయన కుమారుడు హరికృష్ణ అనడంలో అర్ధం లేదన్నారు.

గతంలో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో రాష్ట్రాన్ని విభజించాలని ఎన్టీఆరే స్వయంగా కోరారని కేటీఆర్ గుర్తు చేశారు. చరిత్ర గురించి తెలుసుకోకుండా హరికృష్ణ మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఇక్కడ విభజనకు మేం వ్యతిరేకం కాదంటూనే, పార్లమెంటులో టీడీపీ ఎంపీలు మాత్రం నినాదాలు చేయడాన్ని ఏమనుకోవాలని టీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News