: కూలిన కళాశాల భవనం.. విద్యార్ధులకు గాయాలు
కళాశాల భవనం పాక్షికంగా కూలి 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఒడిశాలోని కియోంజర్ లో నిర్మాణంలో ఉన్న కళాశాల భవనం కూలింది. దీంతో అక్కడే చదువుకుంటున్న 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.