: మల్లయుద్ధానికి కూడా పాకిన ఫిక్సింగ్


క్రికెట్ కే పరిమితం అనుకున్న ఫిక్సింగ్ భూతం మల్లయుద్ధానికీ పాకినట్లు తెలుస్తోంది. ఒలింపిక్స్ లో రెండు సార్లు ప్రత్యర్థులను మట్టి కరిపించి, భరతమాత మెడలో పతాకమేసిన వ్రెస్ట్ లింగ్ చాంపియన్ సుశీల్ కుమార్ కు ఫిక్సింగ్ వీరులు కోట్ల రూపాయలు ఆశ చూపారంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వార్తను ప్రచురించింది.

2010లో మాస్కోలో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ లో ఓడిపోతే కోట్లిస్తామంటూ తనకు ఆశ చూపారని సుశీల్ వెల్లడించారు. ఫైనల్ మ్యాచులో రష్యా క్రీడాకారుడు అలన్ గొగేవ్ చేతిలో ఓడిపోతే కోట్లిస్తామంటూ మాజీ కోచ్ ద్వారా సంపద్రించారని చెప్పాడు. ఒక వ్రెస్ట్ లర్ కు అన్ని కోట్లనేవి చాలా ఎక్కువని అన్నాడు. కానీ దేశ ప్రతిష్ఠ ముందు రెండు, మూడు, నాలుగు కోట్లు ఓ లెక్కా అనుకున్న సుశీల్ నాటి మ్యాచులో అలన్ గొగేవ్ ను 3-1 తేడాతో మట్టికరిపించి వెండి పతకాన్ని భారత్ సొంతం చేశాడు. భారత్ పరువు, ప్రతిష్ఠలను కాపాడాడు.

  • Loading...

More Telugu News