: ఇలాకూడా బరువు తగ్గొచ్చు


బరువును తగ్గించుకోవాలంటే స్కిప్పింగ్‌ ఆట ఆడితే మంచిదంటున్నారు నిపుణులు. అయితే, ఈ విషయంలో నిపుణుల సలహా మాత్రం తీసుకోవాలి. అప్పుడే బరువు తగ్గడం ఈజీ అవుతుంది. ప్రతి రోజూ సుమారు ఒక గంటసేపు గనుక మనం స్కిప్పింగ్‌ ఆట ఆడితే, మన శరీరంలో మూడువందల కెలోరీలు ఖర్చవుతాయట. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలా సులభమైన మార్గం. ఈ వ్యాయామం మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట.

మరీ నిదానంగాను, లేదా మరీ వేగంగాను ఆడకుండా మధ్యస్థంగా ఆడడం వల్ల కీళ్లు, కండరాలు కూడా గట్టిపడతాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుందట. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎముకల ఎదుగుదల బాగుంటుంది. స్కిప్పింగ్‌ వల్ల ఎముకలు గుల్లబారకుండా గట్టిపడతాయి. శరీరంలో పేరుకున్న కొవ్వు త్వరగా కరిగిపోతుంది.

చేతులు సన్నబడాలనుకునేవారు ఈ ఆట ఆడితే మంచి ప్రయోజనం కలుగుతుంది. పది నిముషాల పాటు స్కిప్పింగ్‌ ఆడడం వల్ల కలిగే ప్రయోజనం ఒకటిన్నర కిలోమీటరు దూరం నడవడం వల్ల కలిగిన ప్రయోజనానికి సమానమని బ్రిటన్‌కు చెందిన నిపుణులు చెబుతున్నారు. స్కిప్పింగ్‌ చేయడం వల్ల అలసట కూడా తగ్గుతుందట. ఇన్ని ప్రయోజనాలున్న ఈ స్కిప్పింగ్‌ను నిపుణుల సలహాతో చేస్తే మరింత ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News