: మీ పిల్లల్లో చక్కటి ఆలోచనా సామర్ధ్యం కావాలంటే...


మీ పిల్లలు చక్కటి ఆలోచనా సామర్ధ్యాన్ని కలిగివుండాలని మీరు కోరుకుంటున్నారా... అయితే చక్కగా మీ పిల్లలను వీడియో గేములు ఆడనివ్వండి. దీంతో వారిలో చక్కటి ఆలోచనా సామర్ధ్యం పెరుగుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వీడియో గేములు ఆడడం వల్ల పిల్లల్లో మెదడు చురుకుదనాన్ని సంతరించుకుంటుందని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది.

క్వీన్‌మేరీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో కొన్ని రకాల వీడియో గేములు ఆడడం వల్ల మనిషి మెదడుకు మరింత పదును పెట్టే శక్తి ఉంటుందని తేలింది. కొన్ని రకాల వీడియో గేములను ఆడడం వల్ల పిల్లల్లో ఆలోచనా సామర్ధ్యం, వ్యూహరచనా సామర్ధ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు తమ పరిశోధనలకుగాను కొందరిని ఎంపిక చేసుకుని వారిని వేరు వేరు బృందాలుగా విభజించారు. వీరిలో కొందరికి సాధారణ, సంప్రదాయ ఆటలను ఆడాల్సిందిగా కోరారు. మరికొందరికి ప్రత్యేకమైన వీడియోగేములను ఆడాల్సిందిగా ఇచ్చారు. ఇలా ఆరునుండి ఎనిమిది వారాలపాటు ఇలాంటి ఆటలు ఆడేలా చూశారు. తర్వాత వారికి వివిధ రకాల పరీక్షలను పెట్టారు. వీరిలో వీడియో గేములు ఆడడానికి ముందు, ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో వీడియో గేములు ఆడిన పిల్లలకు ప్రత్యేక సామర్ధ్యం పెరిగిందని స్పష్టమైనట్టు పరిశోధకులు వివరించారు.

  • Loading...

More Telugu News