: షారుఖ్ రికార్డు బ్రేక్ చేసే సత్తా హృతిక్ కే ఉందా?


బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ ఆసక్తికర చర్చకు కారకుడయ్యాడు. తన తాజా చిత్రం 'చెన్నై ఎక్స్ ప్రెస్' రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుండడంతో ఆ రికార్డును ఎవరు బద్దలు కొడతారని చర్చించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజై అతివేగంగా వంద కోట్ల క్లబ్ ను దాటేసి 200 కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులిడుతోంది. అయితే త్వరలో అమితాబ్, అజయ్ దేవగన్, కరీనా నటించిన 'సత్యాగ్రహ', రణ్ బీర్ కపూర్ 'బేషరమ్', హృతిక్ రోషన్ 'క్రిష్ 3', అమీర్ ఖాన్ 'ధూమ్ 3' సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వీటిలో షారూఖ్ రికార్డును బ్రేక్ చేసే సత్తా 'క్రిష్ 3' కే మెండుగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 'క్రిష్ 3' ట్రైలర్ అంతర్జాతీయంగా క్రేజ్ సంపాదించుకుంది.

  • Loading...

More Telugu News