: రాష్ట్ర విభజన కాంగ్రెస్ సొంతింటి వ్యవహారమనుకుంటోంది: రాఘవులు
రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సొంతింటి వ్యవహారమనుకుంటోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవి రాఘవులు విమర్శించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ సమైక్యానికి కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల తాగు, సాగు నీటి సమస్యలతో పాటు మరిన్ని పరిష్కరించలేని సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన తెలిపారు. రాజ్యసభ సభ్యుడు వీహెచ్ కు నోటిదురుసు కాస్త ఎక్కువని, అయినా సరే దాడి మాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రపై మండిపడ్డ రాఘవులు, బాబు ముందుగా తన వైఖరిని స్పష్టం చేసి ఆ తరువాత ఆత్మగౌరవ యాత్ర చేపట్టాలని డిమాండ్ చేశారు.