: యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకున్న షరపోవా
యూఎస్ ఓపెన్ నుంచి ప్రముఖ అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవా తప్పుకుంది. 2006 యూఎస్ ఓపెన్ ఛాంపియన్ అయిన షరపోవా భుజం గాయం కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని యూఎస్ టెన్నిస్ అసోసియేషన్ ప్రకటించింది. గత కొంత కాలంగా షరపోవా భుజం గాయంతో బాధపడుతోంది. ఆ గాయం నుంచి కోలుకునేందుకు మరింత సమయం కావాల్సి ఉండడంతో ఆమె తాజా నిర్ణయం తీసుకుంది.