: సమైక్యాంధ్రకు మద్దతుగా కర్నూలులో 'లక్ష గళ ఘోష'
జనం ... జనం ... ఎక్కడ చూసినా జనం ... కర్నూలు పట్టణం ఇలా జనంతో నిండిపోయింది. సమైక్యాంధ్ర మద్దతుదారులు విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహించిన 'లక్ష గళ ఘోష' కార్యక్రమంలో సుమారు 65 వేల మంది పాల్గొన్నారు. కర్నూలులోని నాలుగు రోడ్ల కూడలిలో నిర్వహించిన ఈ సభలో తాము రాజధానిని త్యాగం చేశామని, రాజధాని మాదన్న భావనతోనే హైదరాబాద్ డెవలప్ చేస్తుంటే ఊరుకున్నామని అన్నారు. అలాంటి హైదరాబాద్ ను తెలంగాణకు ఎలా ఇస్తారని మండిపడుతున్నారు. రెండు రాష్ట్రాలకు రెండు రాజధానులను ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ ను వదులుకునే ప్రసక్తే లేదని తెలిపారు.