: దాభోల్కర్ హత్య ఘోర తప్పిదం: రాజీవ్ శుక్లా
పూణేలో హేతువాది, హక్కుల కార్యకర్త నరేంద్ర దాభోల్కర్ హత్య ఘోర తప్పిదమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి రాజీవ్ శుక్లా అన్నారు. దాభోల్కర్ హత్యకేసు దర్యాప్తులో మహారాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేస్తామని ఇవాళ రాజ్యసభలో ప్రకటించారు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన సందర్భంగా ఆయన హత్యకు గురైన సంగతి తెలిసిందే. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.