: సైనా వ్యాఖ్యలు విచారకరం: గుత్తా జ్వాల


సీనియర్ బ్యాట్మింటన్ క్రీడాకారుడు తౌఫిక్ హిదాయత్ పట్ల సైనా నెహ్వాల్ చేసిన వ్యాఖ్యలపై మరో క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పందించారు. తౌఫిక్ వాస్తవాన్ని అంగీకరించాలని, ఆయనొక రిటైర్డ్ ప్లేయర్ కనుక ఇండియన్ బ్యాట్మింటన్ లీగ్ (ఐబిఎల్)లో ఎక్కువ ధరను పొందలేరని సైనా నెహ్వాల్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై జ్వాల ట్విట్టర్ లో స్పందించారు. తౌఫిక్ హిదాయత్ గొప్ప ప్లేయర్ గా అభివర్ణించారు. తౌఫిక్ పట్ల గౌరవం లేకండా ఎవరూ ఇలా మాట్లాడతారని అనుకోలేదని ట్వీట్ చేసింది. ఐబిఎల్ లో హైదరాబాద్ ఫ్రాంచైజీ తరఫున సైనా, తౌఫిక్ ఆడుతుంటే, జ్వాల ఢిల్లీ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News