: ఆస్ట్రేలియన్ యువతితో వసీం అక్రమ్ వివాహం
పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్(47) ఆస్ట్రేలియన్ యువతి షనీరియా థాంప్సన్ ను వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అక్రమే మీడియాకు వెల్లడించాడు. లాహోర్ లో తమ పెళ్లి జరిగిందని, ఇకనుంచి తను, తన పిల్లలు కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నట్లు తెలిపాడు. అక్రమ్ కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, భార్య హుమా 2009లో అనారోగ్యంతో చనిపోయింది. దాంతో, కొంతకాలం నుంచి ముప్పైఏళ్ల థాంప్సన్ తో ప్రేమలో ఉన్న అక్రమ్ ఇప్పుడు ఆమెను పెళ్ళాడాడు.