: 'మద్రాస్ కేఫ్' విడుదలకు తమిళనాడులో బ్రేక్
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం నటించి, నిర్మించిన 'మద్రాస్ కేఫ్' చిత్రానికి తమిళనాడులో బ్రేక్ పడింది. ఈ చిత్రానికి ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డ్ క్లియరెన్స్ ఇచ్చేంతవరకు తమిళ వెర్షన్ విడుదల చేయరాదంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోర్టు విడుదలపై స్టే ఇచ్చింది. ఈ చిత్రంలో ఎల్టీటీఈ నేతలను టెర్రరిస్టులుగా చూపించారంటూ కొన్ని రోజుల నుంచి 'నామ్ తమిజ్హర్ కట్చి' (మాది తమిళుల పార్టీ) నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసింది. 'విక్కీ డోనర్' చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు షూజిత్ సిర్కార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.