: ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే విభజన ఆగుతుంది: అశోక్ బాబు
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేస్తే సోనియా హైదరాబాద్ వచ్చి మరీ విభజన నిర్ణయాన్ని వాపసు తీసుకుంటారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, సమైక్యాంధ్రను వ్యతిరేకించే అన్ని పార్టీలను ఓడించాలని ప్రచారం చేస్తామన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టిందని, అయితే ఇది ఉద్యోగుల సమ్మె కాదని ప్రజా ఉద్యమమని ఆయన అన్నారు. ప్రభుత్వం అనుమతినివ్వకపోయినా సెప్టెంబర్ 7 న హైదరాబాద్ లో సభ నిర్వహిస్తామని అశోక్ బాబు స్పష్టం చేశారు.