: కాంగ్రెస్ స్క్రిప్టు రాసిస్తే సురేఖ చదివారు: అంబటి


జగన్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల ఆశ్చర్యం కలగలేదని కాంగ్రెస్ స్క్రిప్టు రాసిస్తే ఆమె చదివినట్టుందని ఆరోపించారు. గుంటూరులో నేడు మీడియాతో మాట్లాడుతూ, జగన్ పై నిందలు మోపడం సరికాదని హితవు పలికారు. సురేఖ ప్రస్తుతం కాంగ్రెస్ విషకౌగిలిలో చిక్కుకుని ఉన్నట్టుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల సంయమనం పాటిస్తూ వచ్చామని, ఆమె తాజా ఆరోపణలను ఖండిస్తున్నట్టు అంబటి పేర్కొన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళదలుచుకుంటే తమకేమీ అభ్యంతరంలేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News