: త్వరలో హరికృష్ణ చైతన్య యాత్ర?


ఇటీవల కాలంలో టీడీపీ అధినాయకత్వంపై ప్రచ్ఛన్న పోరాటం నిర్వహిస్తున్న నందమూరి హరికృష్ణ త్వరలోనే చైతన్య యాత్ర చేపట్టనున్నట్టు తెలుస్తోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి ఈ రథయాత్ర ఆరంభిస్తారని సమాచారం. ఇందుకోసం తన పాత చైతన్యరథాన్ని హరికృష్ణ వినియోగించనున్నారు. నిన్న సమైక్యాంధ్ర కోసం దీక్షలు చేపట్టిన పార్టీ నేతలను ఆయన వ్యక్తిగతంగా ఫోన్ లో పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం తాను సమైక్యాంధ్రకే మద్దతిస్తున్నట్టు ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News