: సామాజిక కార్యకర్త హత్యకు నిరసనగా పుణే బంద్
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త నరేంద్ర దభోల్కర్ హత్యకు నిరసనగా పుణేలో బంద్ జరుగుతోంది. స్వచ్ఛంద సంస్ధలు, రాజకీయ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు సాగుతున్న ఈ బంద్ లో భాగంగా విద్యార్ధులు, పౌరులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మూఢనమ్మకాల పేరుతో సాగే అమానవీయ చర్యలను అరికట్టడానికి పటిష్ఠమైన చట్టం తేవాలని నరేంద్ర దభోల్కర్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. 69 ఏళ్ల నరేంద్ర దభోల్కర్ నిన్న ఉదయం వాకింగ్ కు వెళ్లినప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరుపడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నిందితుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.