: జగన్ తో జాగ్రత్తగా ఉండాలి: కొండా సురేఖ
వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మీయురాలిగా వినుతికెక్కిన కొండా సురేఖ ఏమంటున్నారో వినండి. వైఎస్ జగన్ తో సీమాంధ్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఎప్పుడెలా వ్యవహరిస్తారో తెలియదన్నారు. తండ్రి రాజశేఖరరెడ్డి తెలంగాణకు మద్దతు పలికితే, ఆయన తనయుడిగా జగన్ పూర్తి విరుద్ధ వైఖరి అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణపై ఇచ్చిన మాటకు కట్టుబడలేదని, అందుకే వైఎస్సార్సీపీని వీడాల్సి వచ్చిందని సురేఖ వివరించారు. రాజశేఖరరెడ్డిని విమర్శించిన వారే ఇప్పుడు పార్టీలో ప్రముఖులుగా చలామణీ అవుతున్నారని ఆరోపించారు. వైఎస్ కారణంగానే తెలంగాణ సాకారమైందని, ఆయన పేరిట స్మృతి వనం ఏర్పాటు చేయాలని సురేఖ డిమాండ్ చేశారు.