: జగన్ కు రాఖీ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాఖీ కట్టేందుకు చంచల్ గూడ జైలు వద్ద మహిళలు బారులు తీరారు. అయితే, పోలీసులు వారిని అనుమతించకపోవడంతో నిరసన తెలిపారు. అనుమతి ఇచ్చేంతవరకు కదిలేదిలేదన్నారు. రాఖీ కడతామని రెండు రోజుల ముందే తాము జైలు అధికారులకు తెలిపామంటున్నారు. కొంతమంది జైలు గేటు బయటే జగన్ ఫోటోకు రాఖీ కడితే, ఇంకొందరు అక్కడికి వచ్చిన ఆయన సతీమణి భారతి చేతికి రాఖీలు కట్టారు.