: ముఖ్యమంత్రికి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటనలో బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, అలాగే గాయపడిన వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరుతూ ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. మరోవైపు ఉగ్రవాద సంస్థ పేరుతో తన నివాసానికి వచ్చిన లేఖ ఆకతాయిలు రాసి ఉంటారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.