: జగన్ కేసులో సీబీఐ ఎదుటకు ధర్మాన
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హైదరాబాదులోని దిల్ కుషా అతిధి గృహంలో సీబీఐ ముందు హాజరయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు భూముల కేటాయింపుపై అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, నిన్ననే మరోసారి ధర్మానకు సీబీఐ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.